వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్‌లో బాలలచిత్రోత్సవం
హైదరాబాద్ః హైదరాబాద్‌లో వచ్చేనెల 14నుంచి వారంరోజుల పాటు అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ వేడుకల్లో 41 దేశాలకు చెందిన 162 సినిమాలను ప్రదర్శిస్తారు.
చిత్రాల ప్రదర్శన కోసం పది సినిమాహాళ్లను ఎంపిక చేశారు. అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా వున్నప్పటికీ ఈచిత్రోత్సవాన్ని వాయిదా వేయరాదని నిర్ణయించినట్టు రాష్ట్ర హోమ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దేవేందర్‌గౌడ్ చెప్పారు. ఈచిత్రోత్సవం సందర్భంగా బాలల హక్కులపై యూనిసెఫ్ ఆధ్వర్యంలో రెండు రోజులసెమినార్ జరుగుతుందని వీడియో-మీడియా అన్నఅంశంపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని దేవేందర్‌గౌడ్ వెల్లడించారు. ఈ సారి ఉత్సవంలో సౌదీఅరేబియా, సిరియా చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నారు.