• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హెచ్‌జడ్‌ఎల్‌ ప్రయివేటీకరణకు నిర్ణయం

By Staff
|

న్యూఢిల్లీ: హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెజడ్‌ఎల్‌) ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ప్రయివేటీకరణకు వచ్చే నెలలో బిడ్లను ఆహ్వానిస్తారు. అలాగే భారత పర్యాటకాభివృద్ధి కార్పోరేషన్‌, హోటల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలకు చెందిన 13 హోటళ్ల విక్రయ దస్తావేజులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ఉపసంహరణ కేబినెట్‌ కమిటీ సమావేశంలో వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు.

పదమూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణీత కాలవ్యవధిలో జరుగనున్నట్లు, పదమూడు హోటళ్లకు గాను 97 మంది ఐటిడిసి బిడ్డర్లతో పాటు మొత్తం 115 మంది బిడ్డర్లను గుర్తించినట్లు పెట్టుబడుల ఉపసంహరణ మంత్రి అరుణ్‌ శౌరి చెప్పారు.

ఢిల్లీ, బెంగుళూర్‌లలోని హోటల్‌ అశోకాను 30 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నట్లు, దీన్ని రెన్యువల్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఆగ్రా, మధురై, మనాలి, బొద్ఘాయా, హసన్‌, మహాబలిపురంలలోని ఐటిడిసి ఆస్తుల విక్రయానికి వచ్చే నెల బిడ్లను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X