వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్‌లో మహిళాజిహాదీలు
వాషింగ్టన్ః పాకిస్తాన్‌లోని వందకుపైగా మదర్సాలు మహిళా జిహాదీలను తయారు చేస్తున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అయిదేళ్ల బాలికలు మొదలుకుని యాభై ఏళ్ల వృద్ధల వరకు ఈ మదర్సాల్లో శిక్షణ పొందుతున్నట్టుగా పత్రిక వెల్లడించింది.
కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఇస్లాం తరఫున పోరాడివీరమరణం పొందడానికి మతగురువులు వారికి బ్రెయిన్‌వాష్ చేస్తున్నారు. పాకిస్తాన్ మొత్తంమ్మీద పదివేల మదర్సాలు తీవ్రవాదులను ఉత్పత్తి చేస్తున్నట్టుగా పత్రిక వెల్లడించింది. ఈ మదర్సాల్లో ముస్లీమేతరులపైఅసహ్యాన్ని, ద్వేషాన్ని నూరిపోస్తున్నట్టుగా కూడా వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. పదిహేనేళ్లకేపెళ్లయి పిల్లలను కూడా కన్న ఒక మహిళ తన భర్త అనుమతితోజీహాద్లో పాల్గొనడానికి తాను సిద్ధంగా వున్నానని ఎక్కడ పాతిక ముప్ఫై మంది ముస్లీమేతరులు వుంటే అక్కడ తాను మానవబాంబునై పేలడానికి సిద్ధంగా వున్నానని చెప్పినట్టుగా పత్రిక వెల్లడించింది.