• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అజిత్‌ జోగి ఎస్టీ కాదు

By Staff
|
న్యూఢిల్లీః కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, చత్తీస్‌గడ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్‌ జోగి షెడ్యూల్‌ తెగలకు చెందినవారు కాదని బోగస్‌ సర్టిఫికెట్‌తో ఎస్‌టిగా చలామణి అవుతున్నారని జాతీయ షెడ్యూల్‌ కులాలు, తెగల కమిషన్‌ ప్రకటించింది. జోగిపూర్వీకులు సత్నామీ కులస్థులని ఈ కులం ఎస్సీ జాబితాలో వున్నదని కమిషన్‌ పేర్కొంది.

ఎస్టీ కుల ధృవీకరణ పత్రం కోసం తాను కన్వర్‌ కులానికి చెందినవాడినని ఆయన అందరినీ మోసగిస్తున్నారని కమిషన్‌ రూలింగ్‌ ఇచ్చింది. నెలరోజుల్లో ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పైగా జోగి తాత ఎప్పుడో క్రైస్తవం స్వీకరించినందున ఎస్సీగా కూడా జోగి అర్హుడు కాడని ఎస్‌సి, ఎస్‌టి జాతీయ కమిషన్‌ ప్రకటించింది.

ఈ తీర్పు 16వ తేదీనే వెలువడింది. సోమవారం నాడు జోగి ఈ తీర్పుపై బిలాస్‌పూర్‌లోని చత్తీస్‌గడ్‌ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని తనపై కమిషన్‌ ఎదుట కేసు దాఖలు చేసిన వ్యక్తి బిజెపికి చెందినవాడని అజిత్‌ జోగి ఆరోపిస్తున్నారు. ఇదిలా వుండగా కమిషన్‌ తీర్పు కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్‌జోగి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకి సన్నిహితుడు కావడంతో ఈ తీర్పు పర్యవసనాలు తీవ్రంగా వుంటాయని కాంగ్రెస్‌ నేతలు ఆందోళనపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X