• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేలుళ్లతో కంపిస్తున్న కాబూల్‌

By Staff
|

ఇస్లామాబాద్‌ః అఎn్గానిస్తాన్‌పై అమెరికా దాడులు తీవ్రమయ్యాయి. సోమవారం నాడు పగలు రాత్రీ కూడా ఎడతెరిపిలేకుండా అమెరికా విమానాలు అఎn్గాన్‌లోని వివిధ టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించాయి. తమ హెలికాప్టర్లు రెండింటిని కూల్చినట్టుగా

తాలిబన్లు చేసిన ప్రకటనను అమెరికా ఖండించింది.

అమెరికా హెలికాప్టర్లను కూల్చివేయడంతో పాటు అమెరికాసైనికులను బందీలుగా పట్టుకున్నట్టు తాలిబన్లు చేసిన ప్రకటను అమెరికా తోసిపుచ్చింది. అయితే తాలిబన్లు మాత్రం కావాలంటే అల్‌జజీరా టీవీ చూడండి నిజంమీకే తెలుస్తుందంటూ ప్రకటనలు చేస్తున్నారు.

రంజాన్‌ ప్రారంభమయ్యేలోగా దాడులు ముగించాలని ఇస్లాం దేశాలనుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా అమెరికా దాడులను ముమ్మరం చేసివుంటుందని భావిస్తున్నారు. కాబూల్‌లో మంగళవారం వేకువ జామున మూడు భారీ పేలుడు శబ్దాలువినవచ్చినట్టుగా అక్కడి పౌరులను ఉటంకిస్తూ వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికావిమానాలు పొరపాటున నార్తర్న్‌ అలయెన్స్‌ శిబిరంపై కూడా బాంబులు వేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరోవైపు మజారేషరీఫ్‌ను చేజిక్కించుకోవడానికి నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలతో కలసి అమెరికా కమెండోలు వ్యూహం పన్నుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కీలకమైన ఈ స్థావరం అమెరికా చేజిక్కే అవకాశం వుంది. తమ భూభాగంలో అడుగుపెట్టిన అమెరికా కమెండోలు తమ ధాటికి తట్టుకోలేక పిక్కబలం చూపిస్తున్నట్టుగా తాలిబన్లు చెబుతుండగా కలుగులోంచి లాడెన్‌ను బయటకు లాగడమే తరువాయి అని అమెరికా చెప్పుకుంటున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X