• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నష్టాల సంస్థలకు తప్పదు తాళం

By Staff
|

ఫరిదాబాద్‌ః నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ఖాయమని కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్‌సిన్హా స్పష్టం చేశారు. ఆర్ధిక వ్యవస్థపై పెనుభారంగా మారిన సబ్సిడీలను కూడా ఎత్తివేయడం ఖాయమని ఆయన చెప్పారు.

బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని కఠిన నిర్ణయాలకు ప్రజలు సిద్ధంగా వుండాలని ఆయన హెచ్చరించారు. ఫరీదాబాద్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ఫైనిన్సింగ్‌ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలు ఆర్ధిక రంగానికి గుదిబండలుగా మారాయని ఆయనవిమర్శించారు. రాజకీయ, ఆర్ధిక, సమాజిక రంగాలకు సంబంధించి ప్రభుత్వంపై కొన్ని బాధ్యతలు వున్నాయని వాటిని నెరవేర్చాలంటే కఠినంగా వ్యవహరించడం అనివార్యమని సిన్హా చెప్పారు. నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతవిషయంలో మరో ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X