వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆగస్సీతో స్టెఫీ గ్రాఫ్‌వివాహం
లాస్‌ఏంజెల్స్: టెన్నిస్ స్టార్స్ ఆండ్రీఅగస్సీ, స్టెఫీ గ్రాఫ్ నెవడాలోని లాస్ వేగాస్‌లో సోమవారం నిరాడంబరంగావివాహం చేసుకున్నట్లు టెన్నిస్ ప్రొఫెషనల్‌అసోయేషన్ తెలిపింది. ఈ జంట గత రెండేళ్లుగా కలిసి వుంటున్నారని, వారికి డిసెంబర్‌లో సంతానం కలుగబోతోందని అసోయేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తమకువివాహం చేసుకునే శుభఘడియ వచ్చిందని, తమ జీవిత అధ్యాయం ప్రారంభమవుతోందనిఆగస్సీ, గ్రాఫ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
32 ఏళ్ల స్టెఫీ గ్రాఫ్‌కు ఇది మొదటి వివాహంకాగా, 31 ఏళ్ల ఆగస్సీ నటి బ్రూక్ షీల్డ్స్‌ను ఇంతకు ముందుపెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు 1999లో విడాకులు తీసుకున్నారు.