వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టణాల్లో రెండు వేల కోట్లతో గృహవసతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గల పేదలకు, మురికి వాడల నివాసితులకు రెండు వేల కోట్లతో గృహ వసతి కల్పించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్‌ విలేకరులకు చెప్పారు.

వాల్మికీ అంబేడ్కర్‌ ఆవాస్‌ యోజన పేర ఈ పథకాన్ని దేశంలో ఐదు వేలకు పైగా పట్టణాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రకటించారని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు, మురికివాడల్లోని ప్రజలకు ఈ పథకం కింద 2010 నాటికి గృహవసతి, పారిశుధ్య సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండు వేల కోట్లలో సగం సబ్సిడీగా, మిగతా సగం రుణంగా సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి పథకం దేశంలో ఇదే మొదటిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X