• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముషారఫ్‌ విజ్ఞప్తిని త్రోసిపుచ్చిన అమెరికా

By Staff
|

వాషింగ్టన్‌: రంజాన్‌ మాసం లోగాఅఫ్ఘనిస్తాన్‌పై దాడులను ముగించాలని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ చేసిన విజ్ఞప్తిని అమెరికా త్రోసిపుచ్చింది. ముస్లిం పవిత్ర మాసం గౌవరప్రదమైనదే అయినప్పటికీ అఎn్ఘానిస్థాన్‌లో తమ మిషన్‌ కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది.

ముస్లిం పవిత్ర మాసం అందరూ గౌరవించదగిందే కానీ అఎ్ఘానిస్థాన్‌లో తమ దాడులు కొనసాగుతాయని, దీన్ని ముషారఫ్‌ అర్థం చేసుకోగలరని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ అన్నారు. తమ పవిత్ర పర్వదినాల్లో ముస్లిం దేశాలు తమలో తాము

పోరాడడమే కాకుండా ఇతర దేశాలతో పోరాడిన చరిత్ర వున్నదని అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ అన్నారు.

కాబూల్‌, కాందహార్‌లపై అమెరికా చేసిన దాడుల్లో 40 మంది మరణించారని తాలిబాన్‌ ప్రకటించింది. అఎn్ఘానిస్థాన్‌లో భూతల పోరుకు బ్రిటన్‌ వేయి మంది ప్రత్యేక బలగాల కమెండోలను పంపింది. హేరాత్‌, కాందహార్‌ పట్టణాలపై అమెరికా వైమానిక దాడులు పెద్ద యెత్తున నిర్వహించింది. కాందహార్‌లో ఒక ఆయిల్‌ ట్యాంకర్‌పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో అయిదుగురు మరణించారు.

తాము రెండు అమెరికా హెలికాప్టర్లను కూల్చినట్లు తాలిబాన్‌ చేసిన ప్రకటనను అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ఫీల్డ్‌ ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X