వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చల ప్రారంభానికిసహాయం: అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌:ఉపఖండంలో శాంతి, స్థిరత్వం కోసం అవసరమనుకుంటే భారత్‌,పాకిస్థాన్‌ల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభం కావడానికిఅమెరికా సహాయం చేస్తుందని అమెరికా విదేశాంగ మంత్రికొలిన్‌ పావెల్‌ చెప్పారు.

ఉగ్రవాద వ్యతిరేక పోరుకు ఉభయదేశాలు కట్టుబడి వున్నాయని, రెండు దేశాలు కూడాచర్చలను కోరుకుంటున్నాయని, అయితే, చర్చలనుపునఃప్రారంభించడంలో ఈ దేశాలు స్వల్పఇబ్బందిని ఎదుర్కుంటున్నాయని ఆయన అన్నారు.పాకిస్థాన్‌, భారతదేశాల నేతలు చర్చలుజరగాలనే ఉద్దేశంతో ఉన్నట్లు, అయితే చర్చలను ప్రారంభించడానికివారికి స్వల్ప ఇబ్బంది ఉన్నట్లు తాను ఇటీవల తన పర్యటనసందర్భంగా ఉభయ దేశాల నేతల మాటలను బట్టిఅర్థమైందని, ఈ విషయంలో తాను సహాయంచేయగలనని ఆయన అన్నారు.

సహజంగానే ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని, తనపాకిస్థాన్‌ పర్యటన ఆఖరు రోజు రాత్రి నియంత్రణ రేఖవద్ద కాల్పులు జరగడంతో ఉద్రిక్తత మరింతపెరిగిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X