• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హర్కత్‌ మిలిటెంట్లఅరెస్టు- కుట్ర భగ్నం

By Staff
|

థానె: హర్కత్‌-వుల్‌- ముజాహిదీన్‌కు చెందిన నలుగురు కరుడు గట్టినమిలిటెంట్లను ముంబ్రాలో బుధవారంనాడు పోలీసులుఅరెస్టు చేశారు. దీంతో థానె, ముంబాయిలలో భారీపేలుళ్లకు, రాజకీయ నాయకుల హత్యకు హర్కత్‌-ఉల్‌- ముజాహిదీన్‌ పన్నిన కుట్ర భగ్నమైంది.

వారి నుంచి పోలీసులు మూడు రివాల్వర్లు, 26 లైవ్‌ కాట్రిడ్జెస్‌, డాక్యుమెంట్లు, ముంబాయి గైడ్‌స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.ఎం. శంగారి చెప్పారు. కాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతానికి చెందిన ఈమిలిటెంట్లు రద్దీగా వుండే ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడడం ద్వారా, ప్రముఖ రాజకీయ నేతలను హత్య చేయడం ద్వారా భయాందోళనలను కలిగించడానికి కుట్ర పన్నారని ఆయన చెప్పారు.
అరెస్టయిన మిలిటెంట్లను జావెద్‌ అలియస్‌ జహ్మద్‌ మహ్మద్‌అక్బర్‌ భట్‌ (23), ఫరూఖ్‌ అహ్మద్‌ మహమ్మద్‌ సిద్దిఖి (23), అల్తాఫ్‌ హుస్సేన్‌ గులామ్‌ మొహదీన్‌ (19), ఫరూఖ్‌ అహ్మద్‌ మహ్మద్‌ రంజాన్‌ సోబన్‌ (28)లుగా గుర్తించారు.వీరు రెండు వారాలుగా ముంబ్రాలో రహస్యంగా వుంటున్నారు. కాశ్మీర్‌లోని పలు హత్యలతో సోబన్‌కు సంబంధం వున్నదని,జిహాద్‌ ఉద్యమంతో ఇతనికి సన్నిహిత సంబంధం వున్నదని శంగారి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X