హర్కత్ మిలిటెంట్ల శవాల తిరస్కరణ
ఇస్లామాబాద్: అమెరికా దాడుల్లో మరణించిన 35 మంది హర్కత్-ఉల్- ముజాహిదీన్‌మిలిటెంట్లలో ఎనమండుగురి శవాలను పాకిస్థాన్ సరిహద్దు బలగాలు బుధవారంనాడు లోనికి అనుమతించలేదు. ఈ ఎనమండుగురు కూడా లాహోర్ నగరానికి చెందినవారు. ఇందులోసీనియర్ నేత ఉస్తాద్ ఫరూఖ్ కూడా వున్నాడు.
శవాలనుస్వాధీనం చేసుకోవద్దని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలుఅందాయని బఖ్తియార్ ఖాన్ తూర్పు ప్రొవిన్స్‌లోని తోర్ఖం క్రాసింగ్ పాయింట్ అధికారి చెప్పారు.జిహాద్ చేయడానికి వారు కాబూల్‌లో ఉన్నారని రాడికల్ ఇస్లామిక్ జమియాత్-ఇ- ఇస్లామ్ మతగురువు ముఫ్తీ జమాల్ చెప్పారు.
లాడెన్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణపై హర్కత్‌ను అమెరికా ఇది వరకే నిషేధించింది. అమెరికా దాడిలో మరణించిన హర్కత్ కార్యకర్తల అంత్యక్రియలనుపెద్ద యెత్తున నిర్వహించడానికి తాలిబాన్ అనుకూల మత సంస్థలు ఏర్పాట్లు చేయడంతో అంతకు ముందు భద్రతనుపెంచారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!