• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షారుఖ్‌, సల్మాన్‌లకు సమన్లు

By Staff
|

ముంబాయి: గుల్షన్‌ కుమార్‌ హత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి నవంబర్‌ ఒకటవ తేదీనహాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ సెషన్స్‌ జడ్జి ఫిల్మ్‌ స్టార్స్‌ షారుఖ్‌ఖాన్‌కు, సల్మాన్‌ ఖాన్‌కు, చుంకీ పాండేకు సమన్లు జారీ చేశారు. నవంబర్‌ ఒకటవ తేదీనగైర్హాజర్‌ కాకూడదని హెచ్చరిస్తూ సెషన్స్‌ జడ్జి ఎం.ఎల్‌. తహిల్యాని ఈ సమన్లు జారీ చేశారు.

వీరు ముగ్గురు బుధవారంనాడు కోర్టు ముందుహాజరు కావాల్సి వుంది. అయితే, వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌ వల్ల వారుహాజరు కాలేకపోయారు. నవంబర్‌ ఒకటవ తేదీన వారు కోర్టుకహాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ చెప్పారు.

గుల్షన్‌ కుమార్‌ హత్య జుహు సబర్బన్‌ ఏరియాలో 1997 ఆగస్టు 12వ తేదీన జరిగింది. ఈ హత్యకు సంబంధించి షారుఖ్‌, సల్మాన్‌, చుంకీలు సమాచారం ఇవ్వగలరని కోర్టు భావిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X