గ్రామంపై అమెరికా దాడి- 12 మంది మృతి
కాబూల్:అఎn్ఘానిస్థాన్ దక్షిణాన గల ఒక గ్రామంపై బుధవారం తెల్లవారు జామున అమెరికా వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడిలో 12 మంది పౌరులు మరణించారని తాలిబాన్ ప్రకటించింది. ఈ విధమైన అమెరికా దాడుల్లో ఇది రెండవదని తాలిబాన్ ఇన్ఫర్మేషన్ చీఫ్ అబ్దుత్ హనన్ హేమత్ చెప్పారు.
ఉగ్రవాద శిబిరంగా భ్రమించి అమెరికా దేహ్ రౌద్ పట్టణ సమీపంలోనిపర్వత ప్రాంతంలో గల ఈ గ్రామంపై అమెరికా దాడులు చేసిందని ఆయన చెప్పారు. ఇది పూర్తిగా మారుమూల ప్రాంతమని, దాడిలో గాయపడిన వారికి చికిత్సఅందించడానికి క్లినిక్లు కూడా లేవని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఆయన అన్నారు.
మంగళవారం రాత్రి అమెరికా కాబూల్పైనే కాకుండా గుల్ బాగ్, రిష్కోర్ ప్రాంతాల్లోనిసైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో భవంతులు ధ్వంసమయ్యాయని, అయితే వాటిలో ఎవరూ వుండడం లేదని ఆయన చెప్పారు. కాబూల్పై రాత్రి తొమ్మిది బాంబులు పడ్డాయని ఆయన చెప్పారు.