• search

బోఫోర్స్‌ నిందితుడు విన్‌ఛద్దా మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీః కోట్లాది రూపాయల బోఫోర్స్‌ ముడుపుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు విన్‌ఛద్దా బుధవారం నాడు గుండెపోటుతో మరణించారు. బుధవారం వేకువ జామున రెండు గంటల ప్రాంతంలో ఆయన మరణించారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ఆయన కుటుంబం దుబాయిలో వుంటుంది. గురువారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని ఛద్దా సొంత కంపెనీ అనాట్రోనిక్‌ గ్రూప్‌ జనరల్‌ మానేజర్‌ శైలేష్‌ బాబు చెప్పారు.

    ఇదే కేసులో మరో నిందితుడు రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌కె భట్నాగర్‌ కూడా కాన్సర్‌తో కొద్ది నెలలక్రితం మరణించారు. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులతో బాధపడుతున్న ఛద్దా గత నెల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత బోఫోర్స్‌ కేసువిచారిస్తున్న స్పెషల్‌ కోర్టుకు దరఖాస్తు చేసుకుని దుబాయి వెళ్లడానికి తనకు అనుమతినివ్వాలనికోరారు. దుబాయిలోని తనకుటుంబంతో ఆఖరు రోజులు గడపదల్చుకున్నానని కోర్టుకువిన్నవించుకున్నారు.

    బోఫోర్స్‌ కేసులో నిందితులుగా వున్న హిందూజాలను విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతించినవిషయం కూడా ఆయన తన దరఖాస్తులో ప్రస్తావించారు. ఈ దరఖాస్తుపైవిచారణ 29న జరగాల్సివుంది. దుబాయి నుంచి గత ఏడాది మార్చిలోనే ఢిల్లీ వచ్చిన ఛద్దా కోర్టు ఆదేశాల వల్ల బెయిల్‌పై ఇండియాలోనే వుండిపోయారు. చికిత్సకోసం దుబాయి వెళ్లడానికి అనుమించాలన్నవిజ్ఞప్తిని విచారణ జరుపుతున్న కోర్టు కొట్టివేసింది. పై కోర్టులు కూడా ఈవిషయంలో కలగజేసుకోవడానికి నిరాకరించాయి.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more