వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యాసాగర్‌ బంధువు విడుదలకు షరతులు?

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర రావు బావ మరిది మార్తాండరావును నక్సల్స్‌ చెర నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్తాండరావును విడుదల చేసేందుకు నక్సల్స్‌ కొన్ని షరతులు విధించినట్లు చెబుతున్నారు.

మధ్యవర్తుల ద్వారా నక్సల్స్‌ తమ డిమాండ్లను పంపించారని తెలుస్తోంది. అయితే, నక్సల్స్‌ షరతులు విధించారనే వార్తలను మార్తాండరావు కుటుంబ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. నక్సల్స్‌ ఏ విధమైన షరతులూ పెట్టలేదని మార్తాండరావు సోదరుడు మదన్‌మోహన్‌ రావు చెప్పారు. మార్తాండరావు కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మీడియా అసత్య ప్రచారం వల్లనే తమ సోదరుడి కిడ్నాప్‌ ఉదంతం జటిలమైందని మార్తాండరావు కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. శుక్రవారం ఉదయం నక్సల్స్‌ మార్తాండరావును తీసికెళ్లారు. ఆ రోజు రాత్రో, మర్నాడో నక్సల్స్‌ మార్తాండరావును వదిలేస్తారని తాము అనుకున్నామని, అయితే, మీడియా ప్రచారం వల్ల మార్తాండరావు విడుదలలో జాప్యం జరిగిందని వారంటున్నారు.

తాము నక్సల్స్‌తో సంప్రదింపులు జరపడం లేదని, నక్సల్స్‌ తమను డబ్బులు డిమాండ్‌ చేయడం లేదని మదన్‌మోహన్‌ రావు అన్నారు. మార్తాండరావు విడుదలకు తమ సానుభూతిపరులు చొరవ చూపి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు.మార్తాండరావు కోసం ఆయన బంధువులు వేములవాడలో నిరీక్షిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రో, సోమవారం తెల్లవారు జామునో విడుదల కావచ్చునని వారు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X