వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా, రష్యాలకు తాలిబాన్‌ హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌:అఎn్గానిస్థాన్‌ పట్ల తన వైఖరిని సమీక్షించుకోవాలని లేదా వేలాది మంది ప్రజల తిరుగుబాటును ఎదుర్కోవాలని తాలిబాన్‌ అమెరికాను హెచ్చరించింది. ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్ధం చేయకుండా వుండాలంటే అమెరికాఅఎn్ఘానిస్థాన్‌ పట్ల తన విధానాలను, రాజకీయాలను మార్చుకోవాలని తాలిబాన్‌ అధికార ప్రతినిధి ముల్లాఅమీర్‌ ఖాన్‌ ముతక్కి పాకిస్థాన్‌కు చెందిన అఎn్ఘాన్‌ ఇస్లామిక్‌ ప్రెస్‌తో అన్నారు.

యుద్ధానికిస్వస్తి చెప్పాలని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఆ దేశ ప్రజలకువిజ్ఞప్తి చేశారు. తన వైఖరి మార్చుకోకపోతే వందలాది, వేలాది మంది ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా పోరాటంలోకి దిగుతారని ఆయన అన్నారు.

అఎn్ఘాన్‌ వ్యవహారాలకు దూరంగా వుండాలని తాలిబాన్‌ మరో వైపు రష్యాకు హెచ్చరిక చేసింది. గత యుద్ధం నుంచి రష్యా గుణపాఠం తీసుకోవాలని,అఎn్ఘాన్‌పై యుద్ధం చేయడం వల్లనే సోవియట్‌ యూనియన్‌ చీలిపోయిందని ముల్లాఅమీర్‌ ఖాన్‌ ముతక్కి అన్నారు. ఇప్పుడు జోక్యం చేసుకుంటే రష్యా మరింతగా చీలికలుపేలికలు అవుతుందని ఆయన అన్నారు. అఎn్గానిస్థాన్‌స్వతంత్ర దేశమని, కీలుబొమ్మ యజమానులను, బానిసత్వాన్నిఅంగీకరించదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X