జూనియర్ డాక్టర్ల సమ్మె భేరి
హైదరాబాద్ః నవంబర్ ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న తమ సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సంఘం ఆరోపించింది.
సమ్మెపై వారం రోజుల్లో ప్రభుత్వం తగిన విధంగా స్పందించి తమ డిమాండ్లను తీర్చని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె శ్రీనివాస్, జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ వి శ్రీనివాస్ తదితరులు ప్రకటించారు. వైద్య కళాశాలల్లో డిమాండ్‌కు తగినట్టుగాసీట్ల సంఖ్యను పెంచాలని లైబ్రరీ పుస్తకాల కొనుగోలు కోసం ఒక్కో మెడికల్ కాలేజీకి కనీసం ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖమంత్రి అరుణతో పాటు సంబంధిత అధికారులకు తమ డిమాండ్లవిజ్ఞాపన పత్రం సమర్పించినట్టుగా వారు వెల్లడించారు.