వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్‌పేయికి పాక్ తాజా ఆహ్వానం
ఇస్లామాబాద్: భారత్‌తో ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏ స్థాయిలోనైనా చర్చలకు సిద్ధంగా వున్నామనిఅంటూ పాకిస్థాన్ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ మేరకు ఆహ్వానం పలికింది.
న్యూయార్క్‌లో తాను ముషారఫ్‌ను కలుసుకోవాల్సిన అవసరం లేదని వాజ్‌పేయి సోమవారం చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ- భారత్‌తో ఉన్న విభేదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ అనుకుంటోందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి అజీజ్ మహమ్మద్‌ఖాన్ అన్నారు.
కీలకమైన జమ్మూ కాశ్మీర్ సమస్యతో పాటు అన్ని సమస్యలను శాంతియుత పద్ధతుల ద్వారా భారత్‌తో పరిష్కరించుకోవాలని తాము వాంఛిస్తున్నామని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ను సందర్శించాల్సిందిగా వాజ్‌పేయికి తాము ఆహ్వానం పంపామని ఆయన చెప్పారు.