• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మార్తాండరావు కిడ్నాప్‌- వీడని ప్రతిష్టంభన

By Staff
|

కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర్‌ రావు బావ మరిది మార్తాండరావు కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే వుంది. మార్తాండరావును సిపిఐ(ఎంఎల్‌) జనశక్తి నక్సలైట్లు కిడ్నాప్‌ చేసి మంగళవారం నాటికి ఐదు రోజులవుతోంది.

మార్తాండరావు విడుదలకు నక్సల్స్‌ కొన్ని షరతులుపెట్టారు. మార్తాండరావు ఆధీనంలో వున్న మిగులు భూములనుపేదలకు పంచాలని, జైలులో వున్న తమ అనుచరులుఇద్దర్ని వదిలి పెట్టాలని నక్సల్స్‌ డిమాండ్‌ చేశారు.వీటితో పాటు మరో నాలుగు డిమాండ్లు ఉన్నాయి. మిగులు భూములను పంపిణీ చేయడానికి మార్తాండరావు కుటుంబ సభ్యులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మార్తాండరావు రాజకీయ నేత గానీ, ప్రజా ప్రతినిధి గానీ కారని,అందువల్ల నక్సల్స్‌ ఆయన విడుదలను ప్రభుత్వ విధానాలతో ముడిపెట్టవద్దని కోరెం గ్రామస్థులంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X