• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జోరు తగ్గని అమెరికా దాడులు

By Staff
|

ఇస్లామాబాద్‌ః అమెరికన్‌ యుద్ధ విమానాలు మరోసారి కాబూల్‌, కాందహార్‌ తదితర అఎn్గాన్‌ పట్టణాలపై విరుచుకుపడ్డాయి. దాదాపు 24 గంటల విరామం తర్వాతసోమవారం అర్ధరాత్రి ఒక్కపెట్టున పలు అమెరికన్‌ యుద్ధ విమానాలు అఎn్గాన్‌ గగనతలంలోకి దూసుకువచ్చాయి.

ఈ సారి పట్టణాలతో పాటు తాలిబన్‌ నేతలు, అల్‌ఖైదా ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్టుగా భావిస్తున్న కొండగుహలపై దాడులను కేంద్రీకరించారు. అత్యంత విధ్వంసకరమైన బంకర్‌ బస్టర్‌ బాంబుల మోతతోఅఎn్గాన్‌ కొండప్రాంతాలు దద్దరిల్లాయి. అఎn్గాన్‌ కొండల్లో పురాతన కాలంనాటి గుహలు, టన్నెల్స్‌నే ప్రధానంగా గెరిల్లాలుషెల్టర్లుగా వాడుతుంటారు. వీటిన ధ్వంసం చేసే కార్యక్రమంలో అమెరికా ఇప్పుడు పడింది. మరోవైపుపెద్దఎత్తున పదాతి దళాలు కూడా అఎn్గాన్‌ భూభాగంలో ముందుకు చొచ్చుకుపోతున్నాయి.

గత మూడు వారాల పాటు నిర్వరామంగా కురించిన బాంబు వర్షం వల్ల తమ పదాతి దళాలుఅఎn్గాన్‌ భూభాగంలోనే స్థావరం ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగిందని అమెరికా చెబుతున్నది. స్థావరం ఏర్పాటు చేసుకుంటే ఆ స్థావరం కేంద్రంగా భూతల దాడులను ముమ్మరం చేయవచ్చని అమెరికా భావిస్తున్నది. గత రెండు మూడు రోజులనుంచి ఎన్ని టన్నుల బాంబులు కురించినా తమకు ప్రతిఘటన ఎదురుకావడం లేదని అమెరికా వర్గాలుఅంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X