ముంబయ్‌ః సుప్రసిద్ధ సినీ నటుడు, దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత అశోక్‌ కుమార్‌ కన్ను మూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. మూడేళ్ళుగాఅస్వస్థతో బాధపడుతున్న అశోక్‌ కుమారు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చెంబూర్‌ లోని ఆయన నివాసంలో మరణించారు.

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    అశోక్‌ కుమార్‌ కుమార్తె ప్రీతి గంగూలీ కూడా సినీ రంగంలో వున్నవిషయం విదితమే. సినీరంగంతో సుమారు ఏడు దశాబ్దాల అనుబంధం వున్నఅశోక కుమార్‌ 1911లో జన్మించారు. ముంబయ్‌ టాకీస్‌ లో లాబొరెటరీఅసిస్టెంట్‌ గా చేరిన అశోక్‌ కుమార్‌ 1936లో దేవికా రాణీ సరసన హీరోగాజీన్‌ నయ్యా చిత్రంతో వెండితెర జీవితాన్ని ప్రారంభించారు. దేవికా రాణితో పాటు ఆయన నటించిన సినిమాలు వరుసగా సూపర్‌ హిట్‌ అయ్యాయి. 1936లో అచ్యుత్‌ కన్య, 1937లో ఇజ్జత్‌, అదే సంవత్సరంలో సావిత్రి, 1938లో నిర్మల తదితర చిత్రాలుఅశోక్‌ కుమార్‌ ను వెండితెర వేల్పుగా నిలిపాయి.

    సుమారు రెండు దశాబ్దాల పాటు హీరోగా ఆయన ఏకఛత్రాధిపత్యం చెలాయించారు. 60వ దశకంలో క్యారెక్టర్‌ పాత్రలు ధరిస్తూ కూడాఅశోక్‌ కుమార్‌ ఎంతో పేరు తెచ్చుకున్నారు. 70 దశకంలో కూడా ఆయన నటించినవిక్టోరియా నెం.203, జవాబ్‌, ఛోటీసీ బాత్‌ వంటి చిత్రాలు చిరస్మరణీయాలు.

    1988లో భారత ప్రభుత్వం ఆయనను దాదాసాహెబ్‌ పాల్కే అవార్డుతో సత్కరించింది.అశోక్‌ కుమార్‌ సోదరుడు ప్రముఖ గాయకుడు, నటుడు కిషోర్‌ కుమార్‌అయిన విషయం విదితమే. అశోక్‌ కుమార్‌ కుమార్తె ప్రస్తుతం తండ్రిపేరిట ఓ యాక్టింగ్‌ స్కూల్‌ నడుపుతున్నది.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more