ప్రణాళిక వుంటే కార్య సాఫల్యం
చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటైన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన ఈ సదస్సులో హృషికేష్కు చెందినస్వామి దయానందసరస్వతి ప్రధానోపన్యాసం చేశారు. నిష్కామకర్మగా విధులను నిర్వహించాలని ఆయన సూచించారు. పని మొదలుపెట్టగానే లాభనష్టాల గురించిన యోచనలు చేయరాదని ఆయన అన్నారు. చేసే పనిని ఆనందంగా, సమర్ధంగా పనిచేయాలని ఆయన అన్నారు. నాయకులైన వారు చేసే పనులు నలుగురికి ఆదర్శంగా వుండాలని ఆయన చెప్పారు.
ప్రజలు వారిని ఎప్పుడూ గమనిస్తుంటారని ఆయన తెలిపారు. నాయకులు ఉత్తమమార్గంలో వుంటే ప్రజలు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు యోగ, ధ్యానంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు అధికారులు మంత్రులకోసం కూడా ఈ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గమనార్హం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!