వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇస్లామాబాద్: గడువులోగా తమ ఆయుధాలను స్వాధీనం చేసి లొంగిపోవడంలో తూర్పు అఎn్గానిస్థాన్ పర్వత ప్రాంతాల్లోని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ విధేయ సైనికులు విఫలమయ్యారు. వారు బుధవారం ఉదయం 8 గంటల లోగా లొంగిపావాల్సి వుంది.
ఆల్ ఖయిదాఫైటర్లు లొంగిపోవడానికి అంగీకరించారని, అయితే ఇప్పటి వరకు తమకు ఏ విధమైన సమాచారంఅందలేదని అఎn్గాన్ ప్రభుత్వ కమాండర్ హజ్రత్ అలీ గడువు ముగిసిన గంట తర్వాత శాటిలైట్ ఫోన్లో ఎఎఫ్‌పితో అన్నారు.
మరో రెండు గంటల్లో వారు లొంగిపోవచ్చునని అధికార ప్రతినిధిఅమీన్ ఇస్లామాబాద్‌లో చెప్పారు. వారు లొంగిపోకపోతే చంపుతామని, కీలక ప్రాంతాలన్నీ తమ నియంత్రణలోకి వచ్చాయని, ఆల్ ఖయిదాఫైటర్లు ఒకే పర్వాతానికి పరిమితమయ్యారని ఆయన అన్నారు. మంగళారం పోరులో 8మంది ఆల్ ఖయిదా సభ్యులు మరణించారని, ఇద్దరు గాయపడ్డారనిఅమీన్ చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!