వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్‌ః తోరా బోరా గుహల నుంచి తప్పించుకున్న అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ పాకిస్తాన్‌ లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తున్నది. లాడెన్‌ ను పాకిస్తాన్‌ లో వేటాడి పట్టుకొనేందుకు అమెరికా తన ప్రత్యేక దళాలను పాకిస్తాన్‌ పంపింది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఎబిసి న్యూస్‌ సోమవారం రాత్రి ఈవిషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్‌ లో లాడెన్‌ కోసం వేట సాగించేందుకు సిఐఎ ప్రత్యేక బలగాలను అమెరికాకు పంపిందని ఆ సంస్థ తెలిపింది.

By Staff
|
Google Oneindia TeluguNews

ఆఫ్గనిస్తాన్‌ లోని తోరాబోరా గుహల్లో పట్టుపడ్డ బందీలను ప్రశ్నించి వారి నుంచి కీలకమైన సమాచారం రాబట్టే సంకల్పంతో అమెరికా ఇంటిలిజెన్స్‌ ను పాక్‌ తరలించినట్లు భావిస్తున్నారు. ఇదిలా వుండగా అల్‌ ఖైదా వద్ద శిక్షణ పొందిన తాలిబన్‌ అనుకూల వాద అమెరికా జాతీయుడు వాకర్‌ ను బుష్‌ సర్కార్‌అరెస్టు చేసింది. అతని నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టింది. అల్‌ ఖైదా శిబిరంలో పేలుడు పదార్ధాలు,విషపదార్ధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందినట్లు వాకర్‌ అంగీకరించాడు. అల్‌ ఖైదా వద్ద శిక్షణ పొందడంఅంటే అషామాషీ వ్యవహారం కాదని వాకర్‌సగర్వంగా చెప్పాడు. వాకర్‌ పై ఎటువంటి చర్య తీసుకోవాలేనిది అమెరికాకు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X