వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగుళూరుః 300వికెట్లు తీసుకున్న రెండో భారతీయుడిగా అనిల్‌ కుంబ్లే ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించిన బెంగుళూరుటెస్ట్‌ లో భారత్‌ ఎదురీదుతున్నది. 336 పరుగులు స్కోరు వద్ద ఇంగ్లాండ్‌ ఆలౌట్‌అయింది. ఆ తరువాత రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 99 పరుగులకు మూడువికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌ లో భారత్‌ ఇంకా 237 పరుగులు వెనకపడి వుంది. ఫ్లింటాఫ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడువికెట్లు పడగొట్టాడు. లక్ష్మణ్‌ 12 పరుగులకు, దాస్‌ 28 పరుగులకు అవుటయ్యారు. సచిన్‌ 50 పరుగులతో నాటౌట్‌ గా క్రీజ్‌ లో వున్నాడు.వెలుతురు సరిగాలేకపోవడంతో మ్యాచ్‌ ను అర్థాంతరంగా ముగించారు. బుధవారం నాడు కూడా ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో మ్యాచ్‌ జరిపినవిషయం విదితదమే. భారత్‌ బ్యాట్స్‌ మెన్‌ మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ నానా తంటాలు పడ్డారు. ఒక దశలో దాస్‌, సచిన్‌ ను నాజర్‌ హుస్సేన్‌ నోటికి వచ్చినట్లు తిట్టాడు. దాస్‌అందుకు దీటుగా తిట్లదండకం అందుకున్నాడు.అంపైర్లు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః 300వికెట్లు తీసుకున్న రెండో భారతీయుడిగా అనిల్‌ కుంబ్లే ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించిన బెంగుళూరుటెస్ట్‌ లో భారత్‌ ఎదురీదుతున్నది. 336 పరుగులు స్కోరు వద్ద ఇంగ్లాండ్‌ ఆలౌట్‌అయింది. ఆ తరువాత రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 99 పరుగులకు మూడువికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌ లో భారత్‌ ఇంకా 237 పరుగులు వెనకపడి వుంది. ఫ్లింటాఫ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడువికెట్లు పడగొట్టాడు. లక్ష్మణ్‌ 12 పరుగులకు, దాస్‌ 28 పరుగులకు అవుటయ్యారు. సచిన్‌ 50 పరుగులతో నాటౌట్‌ గా క్రీజ్‌ లో వున్నాడు.

వెలుతురు సరిగాలేకపోవడంతో మ్యాచ్‌ ను అర్థాంతరంగా ముగించారు. బుధవారం నాడు కూడా ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో మ్యాచ్‌ జరిపినవిషయం విదితదమే. భారత్‌ బ్యాట్స్‌ మెన్‌ మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ నానా తంటాలు పడ్డారు. ఒక దశలో దాస్‌, సచిన్‌ ను నాజర్‌ హుస్సేన్‌ నోటికి వచ్చినట్లు తిట్టాడు. దాస్‌అందుకు దీటుగా తిట్లదండకం అందుకున్నాడు.అంపైర్లు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

అయితే నిబ్బరం కోల్పోయిన దాస్‌ తనవికెట్‌ ను పారేసుకున్నాడు. ఆ తరువాత సచిన్‌ చక్కని బౌండరీ కొట్టి హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్‌ 102 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో 9 బౌండరీలున్నాయి.

హైదరాబాద్‌ బ్యాట్స్‌ మెన్‌ లక్ష్మణ్‌ బంతినివికెట్లమీదకు ఆడుకొని అవుటయ్యాడు. గత రెండు టెస్టుల్లో లోయర్‌ ఆర్డర్‌ లో వస్తున్న లక్ష్మణ్‌ ను ఈ సారి ఫస్ట్‌ డౌన్‌ లోనేపంపారు. అయితే గంగూలీ ఆశలను లక్ష్మణ్‌ నిలపలేకపోయాడు. సచిన్‌, ద్రావిడ్‌, గంగూలీ రాణిస్తే తప్ప భారత్‌ బెంగుళూరు మ్యాచ్‌ పై పట్టు సాధించే అవకాశం లేదు.

అంతకు ముందు 255/6 స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ మరో 80 పరుగులు జోడించి ఆలౌట్‌అయింది. శ్రీనాధ్‌ కు నాలుగు, శరణ్‌ దీప్‌ సింగ్‌ కు మూడు, కుంబ్లేకు ఒకవికెట్‌ వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X