దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

హైదరాబాద్‌ఃపనికి ఆహార పథకం పై గురువారం నాడు రాష్ట్రఅసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యులమధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.ఈ పథకాన్ని అధికార పార్టీ పూర్తిగా దుర్వినియోగంచేస్తున్నదని ప్రతిపక్ష నేతరాజశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలోవిరుచుకుపడ్డారు. కేవలం తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్తల లాభార్జన పథకంగాదీనిని మార్చారని ఆయన దుయ్యబట్టారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ , ఈ పథకంద్వారా ప్రజల్లో తమ ప్రభుత్వం సాధించినపేరు ప్రతిష్టలను చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్‌ ఈరకమైన ఆరోపణలకు దిగిందని ఆరోపించారు.

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    304నిబంధన కింద ఈ అంశంపై రెండు గంటలపాటు జరిగిన చర్చతో అసెంబ్లీ అట్టుడికింది.కాంగ్రెస్‌, సిపిఎం ప్రభుత్వంపై విరుచుకుపడగా,తెలుగుదేశంకు అండగా బిజెపి నిలబడింది.కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నిప్రభుత్వం ఎక్కడాలేని విధంగా సద్వినియోగంచేస్తున్నదని ముఖ్యమంత్రిచెప్పారు. నీటితీరువా సంఘాలు, జలరక్షణసమితుల వంటి వాటి ద్వారా తాము ఈ పథకాన్నిఅమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

    పథకంఅమల్లో అక్రమాల గురించి కాంగ్రెస్‌ నేత వైఎస్‌ఆరోపణలు చేయగా ముఖ్యమంత్రి మాత్రంమొత్తం పథకాన్ని కాంగ్రెస్‌వ్యతిరేకిస్తున్నట్టుగా చిత్రికరించే ప్రయత్నంచేశారు. ఈర్షవల్లనే కాంగ్రెస్‌ ఈ పథకం పైధ్వజం ఎత్తుతున్నదని ఆయన చెప్పారు.ఈపథకం అమలుతీరుతెన్నులపై సభాసంఘంఏర్పాటుకు కాంగ్రెస్‌ చేసిన డిమాండ్‌ను ఆయనతోసిపుచ్చారు. అక్రమాలు జరగకుండా ఇంటలీజెన్స్‌,విజిలెన్స్‌ శాఖలు అప్రమత్తంగా వున్నాయనిచెప్పారు. ఈ చర్చ ఉద్రిక్తంగా సాగిన తర్వాతచివరలో ఈ పథకం కింద ఇప్పటివరకు 8లక్షల టన్నుల బియ్యాన్ని అందించినకేంద్రాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి మెరుపువేగంతోఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్నిసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత, ఈ పథకాన్నివచ్చే జూన్‌ వరకు పొడగించాలని కోరుతూ విజ్ఞప్తిచేస్తూ మరో తీర్మానాన్ని కూడా సభ ఆమోదించింది.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more