వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాషింగ్టన్‌ఃఉగ్రవాదంపై పోరులో అమెరికా రెండు నాల్కలధోరణి ప్రదర్శిస్తున్నది. భారతపార్లమెంట్ భవనంపై జరిగిన దాడిలో పాక్‌ప్రమేయం వున్నదని ఆరోపిస్తున్న భారత్ అందుకుసంబంధించిన సాక్ష్యాలను చూపాలని అమెరికాడిమాండ్ చేసింది.
అసలీదాడిలో ముషారఫ్ ప్రభుత్వం ప్రమేయంఏమీ లేదని అమెరికా విస్పష్టంగా ప్రకటించింది.జైష్, లష్కర్ ప్రమేయంపై పూర్తిస్థాయిలోదర్యాప్తు జరపాలని అమెరికా తేల్చిచెప్పింది.దర్యాప్తులో తమకూ భాగస్వామ్యంకల్పించాలన్న పాకిస్తాన్ డిమాండ్‌ను ఒకరకంగాఅమెరికా సమర్ధించింది. తీవ్రవాదంపైపోరులో పాక్ చేస్తున్న సాయాన్ని అమెరికాశ్లాఘించింది. భారత పార్లమెంట్‌పై దాడిలోలష్కర్, జైష్ ప్రమేయం
వున్నట్టుగా రుజువులను పాకిస్తాన్‌కు అందజేస్తేపాకిస్తానే సదరు సంస్థలపై తగిన చర్యతీసుకుంటుందని అమెరికా వివరించింది.సాక్ష్యాలున్నా భారత్ స్వయంగాచర్యతీసుకోవడాన్ని తాము అంగీకరించమనికూడా అమెరికా తేల్చిచెప్పింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!