వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో సురేఖ కంటతడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు తమ కుటుంబంపై కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన ఆరోపణలతో రాష్ట్ర అసెంబ్లీ సోమవారం నాడు దద్దరిల్లింది. సురేఖ ఆరోపణలకు ప్రతిగా ఆమె భర్తపై అధికార పక్ష సభ్యులు ఆరోపణలకు దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది.

అక్రమంగా ఆయుధాలు కొనుగోలు చేసినట్టుగా తన భర్తపై వచ్చిన ఆరోపణలను సురేఖ తీవ్రంగా ఖండించారు. పోలీసులకు పట్టుబడిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన సమాచారం మేరకు సురేఖ ఇంటిపై దాడి చేసినట్టుగా పోలీసులు చెబుతున్నప్పటికీ దీనివెనక వరంగల్‌ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకరరావు వున్నట్టుగా సురేఖ ఆరోపించారు. ఒక దశలో ఆవేశంతో ఊగిపోతు తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితేఅందుకు దయాకరరావే బాధ్యత వహించాల్సివుంటుందని సురేఖ తీవ్రంగా హెచ్చరించారు. దయాకర్‌రావు అసమ్మతిగ్రూప్‌ నాయకుడు కావడంతో ఆయన్ను బుజ్జగించడానికి ఆయన చేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మద్దతునిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని సురేఖ తీవ్రంగా ఆరోపించారు. పోడియంలోకి దూసుకువచ్చిన సురేఖ కంటనీరు తీసుకోవడంతో సభలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా తయారయింది.

కాంగ్రెస్‌ పార్టీసీనియర్‌ నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, సిపిఎం నాయకుడు నోముల నర్సింహ్మయ్య కూడా సురేఖకు మద్దతుగా సురేఖ ఆరోపణలపై సభలో సంపూర్ణ చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. సురేఖ భర్త గత చరిత్ర ఆయనకు పలు నేరాలతో వున్న సంబంధాలపై కూడా చర్చ జరిగితే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీలేదని దేవేందర్‌గౌడ్‌ వ్యాఖ్యానించడంతో సభలో మరోసారి అలజడి చెలరేగింది. దయాకరరావువివరణఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా పరిస్థితి మారలేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవడంతో గందరగోళం సద్దుమణిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X