దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

హైదరాబాద్‌ మేయర్‌కు దేశం పోటీ

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: హైదరాబాద్‌, రాజమండ్రి మేయర్‌ పదవులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తో ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

    హైదరాబాద్‌, రాజమండ్రి నగర పాలక సంస్థలకు, నాలుగు మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లోసీట్ల సర్దుబాటుకు సోమవారం బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆఖరి దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదురుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయవిలేకరులతో చెప్పారు. మేయర్‌ పదవికి పోటీ చేసే పార్టీ ఆ పదవిని వదులుకునే పార్టీకి ఎక్కువ కార్పోరేషన్‌ డివిజన్లను వదలాలని తాము తెలుగుదేశం పార్టీకి సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నగర పాలక సంస్థ మేయర్‌ పదవికి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 60 కార్పోరేటర్ల స్థానాలను తమకు వదలి, 40 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయాలని తాము అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు.

    రాజమండ్రి కార్పోరేషన్‌ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు తెలుగుదేశం, బిజెపిలకు మధ్యజరుగుతున్న చర్చలు కూడా ఒక కొలిక్కి రాలేదు. కార్పోరేటర్‌ స్థానాలకు తమకు ఎక్కువ కావాలని బిజెపి పట్టుబడుతోంది.

    హైదరాబాద్‌, రాజమండ్రి కార్పోరేషన్ల మేయర్‌ పదవులకు తెలుగుదేశం పార్టీ, హిందూపూర్‌, గడ్డిఅన్నారం మున్సిపల్‌ చైర్మన్ల పదవులకు బిజెపి పోటీ చేసే విధంగాఇరు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఒప్పందంవివరాలను ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more