వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హన్మకొండ పోలీస్ స్టేషన్ పేల్చివేత
వరంగల్: హన్మకొండ నగరం నడిబొడ్డున ఉన్న పోలీస్ స్టేషన్ ను సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పేల్చివేసింది. పీపుల్స్ వార్ నక్సల్స్ ఈ చర్యకు పాల్పడ్డారు. నగరం కూడలికి సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ ను పేల్చివేయడం దిగ్భ్రాంతికి లోనుచేసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా పూర్తి సమాచారం అందలేదు. గత కొద్ది రోజులుగా వార్ వరుసగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తోంది. ప్రతీకార చర్యలో భాగంగా పోలీస్ స్టేషన్ ను పేల్చివేసినట్లు తెలుస్తోంది.