వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌ఆర్‌ అల్లుడి ప్రమేయంపై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అంతర్జాతీయ టెలిఫోన్‌ కాల్స్‌ (ఐఎస్‌డి) రాకెట్‌లో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అల్లుడు అనిల్‌ కుమార్‌ ప్రమేయంపై శుక్రవారం శాసనసభలో దుమారం చెలరేగింది. ఈ అంశంపై మూడు గంటల పాటు చర్చ జరిగింది.

తన అల్లుడికి ఈ రాకెట్‌తో సంబంధం వున్నదనే ఆరోపణపై తాము ఏ విచారణకైనా సిద్ధమేనని రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. దీనికి ప్రభుత్వం స్పందించకుండా కేసు దర్యాప్తులో వున్నదని, దోషులను శిక్షిస్తామని చెప్పింది. దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. ఈ కేసులో ఇంటర్‌పోల్‌ సహాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు
వివరణలు అడుగుతుండగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానెల్‌ కృష్ణారావు సభను సాయంత్రానికి వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X