వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో దాగిన ఒమర్‌, లాడెన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అమెరికా వేయికళ్లతో గాలిస్తున్న తాలిబన్ల నేత ముల్లా ఒమర్‌, అల్‌ఖైదా నేత లాడెన్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌లోనే దాగివున్నట్టుగా భారత ఇంటలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం ఒమర్‌ పాకిస్తాన్‌ అక్రమిత కాశ్మీర్‌ భూభాగంలోనూ, లాడెన్‌ పాకిస్తాన్‌లోనూ దాగివున్నట్డుగా తెలిసింది.

పాకిస్తాన్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష్య పాలనలో వున్న గిరిజన ప్రాంతాల్లో లాడెన్‌ దాక్కున్నట్టుగా ఇంటలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఒమర్‌ మాత్రం పిఒకెలోని గిల్గిట్‌లో దాక్కున్నట్టుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. లాడెన్‌ పాకిస్తాన్‌లోనే దాక్కుని వుండవచ్చన్న అనుమానం అఎn్గాన్‌ కొత్త ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తున్నది. పాకిస్తాన్‌ ప్రభుత్వం కూడా ఈ అనుమానాలను తోసిపుచ్చడం లేదు. ఇదిలా వుండగా ఎక్కడ దాక్కున్నా లాడెన్‌ను వధించి తీరుతామని అమెరికా అగ్రనేత జార్జ్‌ బుష్‌ మరోసారి ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X