• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్ని పార్టీల్లో ఎన్నికల సందడి

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలో కార్పేరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల సందడి అన్ని పార్టీల్లోనూ ప్రారంభమైంది. పొత్తులు, అవగాహనలకు పార్టీలు ఒక వైపు కుస్తీ పడుతుండగా పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

హైదరాబాద్‌, రాజమండ్రి నగర పాలక సంస్థలకు, నాలుగు మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగునున్నాయి. ఈ స్థితిలో రాజమండ్రి కార్పోరేషన్‌ ఎన్నికల్లో పొత్తుకు తెలుగుదేశం, బిజెపిల మధ్య సాగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. పొత్తు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని బిజెపి చెప్తుతోంది. కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య నేడో, రేపో పొత్తు కుదిరే అవకాశం వుంది. దీంతో మేయర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో నిమగ్నమై వుంది.

హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు ఖరారయింది. తెలుగుదేశం 55 డివిజన్లకు, బిజెపి 45 స్థానాలకు పోటీ చేస్తాయి. మేయర్‌ పదవికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది. అయితే, ఏయే డివిజన్లలో ఏ పార్టీ పోటీ చేయాలనేది ఖరారు కాలేదు.

హైదరాబాద్‌ నగర పాలక సంస్థ మేయర్‌ పదవికి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా వుంది. అంజన్‌కుమార్‌ యాదవ్‌, పిట్ల కృష్ణ, మర్రి శశిధర్‌ రెడ్డి, ముఖేష్‌, తదితరులు మేయర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావుకు అప్పగిస్తూ ఆదివారం జరిగిన స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

మజ్లీస్‌ తరఫున మేయర్‌ పదవి టికెట్‌ను ఆశిస్తూ 600 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని మజ్లీస్‌ స్పష్టం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో రంగంలోకి దిగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కూడా సందడిగా కనిపించింది. డివిజన్‌ స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తామని టిఆర్‌ఎస్‌ నేత కె. చంద్రశేఖర్‌ రావు అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more