వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయ నిర్దోషిత్వం: సుప్రీంలో సవాల్
న్యూఢిల్లీ: టాన్సీ భూకుంభకోణం కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును డిఎంకె కార్యకర్త సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
రెండు టాన్సీ భూకుంభకోణం కేసుల్లో జయలిలితను నిర్దోషిగా ప్రకటిస్తూ మద్రాసు హైకోర్టు డిసెంబర్ 4వ తేదీన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆర్.ఎస్. భారతి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. శీతాకాలం సెలవుల తర్వాత ఈ కేసు విచారణకు వస్తుందని భావిస్తున్నారు. చెన్నైకి చెందిన న్యాయవాది షణ్ముగసుందరం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును హైకోర్టులో దాఖలు చేసింది భారతియే. అందువల్ల హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే హక్కు తనకు వున్నదని భారతి అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!