వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో లాడెన్‌: అమెరికా అనుమానం

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ అమెరికా దాడుల నుంచి తప్పించుకుని పాకిస్థాన్‌ పారిపోయి వుంటాడని అమెరికా విశ్వసిస్తోంది. ఇదే విషయాన్ని సెనేట్‌ ఇంటలిజెన్స్‌ కమిటీ చైర్మన్‌తో పాటు ఇతర అమెరికా అధికారులు చెబుతున్నారు.

లాడెన్‌ బతికి వున్నాడా, లేదా అనే విషయం తమకు తెలియదని, వారం రోజులుగా తమకు పరస్పర విరుద్ధమైన ఇంటలిజెన్స్‌ నివేదికలు అందుతున్నాయని పెంటగాన్‌లోని సీనియర్‌ రక్షణ అధికారి ఒకరు అన్నట్లు ది వాషింగ్టన్‌ పోస్ట్‌ రాసింది.

లాడెన్‌ బతికి వున్నాడని చెప్పిన ఇంటలిజెన్స్‌ వర్గాల గురించి వెల్లడించడానికి సిఎన్‌ఎన్‌ కార్యక్రమంలో గ్రాహమ్‌ నిరాకరించారు. లాడెన్‌ పాకిస్థాన్‌ పారిపోయే అవకాశాలే ఎక్కువగా వున్నాయని అదే కార్యక్రమంలో ఇంటలిజెన్స్‌ కమిటీ మరో సభ్యుడు రిచర్డ్‌ జి లుగర్‌ చెప్పారు.

తాలిబాన్‌ వ్యతిరేక బలగాలు తాలిబాన్‌ నేత ముల్లా మహ్మద్‌ ఒమర్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నాయని, వారు గాలింపు చర్యలు చేపడితే తాము సహకరిస్తామని మరో అధికారి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X