• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండు ప్రమాదాలు- ఆరుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఒక ప్రమాదం తూర్పు గోదావరి జిల్లాలో జరగగా, మరో ప్రమాదం అనంతపురం జిల్లాలో జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. టాక్సీ ఒక కల్వర్టును ఢీకొనగా అందులో వున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొనగా ఈ దుర్ఘటన సంభవించింది. అయ్యప్ప భక్తులు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందినవారు. శబరిమలై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X