హైదరాబాద్ః
తెలుగుదేశం
పార్టీతో
పొత్తు
కుదుర్చుకొని
మినీ
మున్సిపల్
ఎన్నికల
బరిలో
అదృష్టాన్ని
పరీక్షించుకోవాలనుకుంటున్న
బిజెపికి
మొదటి
నుంచీ
కష్టాలు
ఎదురౌతున్నాయి.
తెలుగుదేశం
పార్టీ
తమను
పూచిక
పుల్ల
కింది
లెక్కకట్టడంతో
బిజెపి
అస్థిత్వం
కాపాడుకొనేందుకు
నానా
తంటాలు
పడుతున్నది.
హైదరాబాద్
లో
45
కార్పొరేషన్
స్థానాలకు
తమ
అభ్యర్థులను
దించేందుకు
తెలుగుదేశం
పార్టీని
ఒప్పించగలిగినప్పటికీ
హిందుపూర్,
రాజమండ్రి,
తిరుపతిలలో
దేశంతో
ఇంకా
ఓ
అవగాహనకు
రాలేకపోయింది.
రాజమండ్రిలో
అవసరమైతే
తిరుగుబాటు
బావుటా
ఎగురవేసేందుకు
సైతం
బిజెపి
సిద్ధపడుతున్నది.
పొత్తు
కష్టాలను
అలా
వుంచితే
హైదరాబాద్
లో
టిక్కెట్లు
రాని
అభ్యర్థులు
శుక్రవారం
ఏకంగా
పార్టీ
కార్యలయంలో
నిరాహార
దీక్షలు
ప్రారంభించి
పార్టీ
నాయకత్వానికి
మరో
తలనొప్పి
తెచ్చిపెట్టారు.
విలువలు
లేని
నాయకులకు
బిజెపి
కార్పొరేటర్లుగా
టిక్కెట్లు
ఇచ్చిందని
పెద్ద
సంఖ్యలో
బిజెపి
నేతలు
శుక్రవారం
మధ్యాహ్నం
నుంచి
పార్టీ
కార్యాలయంలోనే
నిరాహార
దీక్షలు
ప్రారంభించారు.
ఈ
గందరగోళాల
మధ్యనే
బిజెపి
14
మందితో
రెండో
జాబితా
ప్రకటించింది.
మిగిలిన
వారితో
శనివారం
ఉదయానికి
తుదిజాబితా
ప్రకటించేందుకు
బిజెపి
కసరత్తు
చేస్తున్నది.