• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌ కాంగ్రెస్‌ మేయర్‌ నాగేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంతా ఊహించిన విధంగానే ఆసిఫ్‌ నగర్‌ ఎమ్మెల్ల్యే దానం నాగేందర్‌ ను కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించింది. 56 కార్పొరేటర్‌ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను కూడా ప్రకటించి తెలుగుదేశం కంటే ఓ అడుగు ముందు నిలిచింది. తుది జాబితాను శనివారం ఉదయానికి విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తున్నది.

మేయర్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ అగ్రనాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు శశిధర్‌ రెడ్డిని మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావించింది. అందుకు ఆయన అంతగా సుముఖత చూపకపోవడంతో దానం నాగేందర్‌ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. రాజకీయ చాతుర్యంతో పాటు కండబలం కూడా పుష్కలంగా వున్న దానం నాగేందర్‌ ను మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X