ఆగ్రాః చైనా ప్రధాని ఝూ రోంగ్జి భారత్‌లో ఆరు రోజుల అధికార పర్యటన కోసం ఆదివారం నాడు ఆగ్రా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌నుంచి అత్యున్నత స్థాయి అధికార బృందంతో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. గత దశాబ్ద కాలంలో చైనా అత్యున్నత స్థాయి నేత భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఝూ భారత్ పర్యటనకు రావడం విశేషం. తాజ్‌మహల్‌ను సందర్శించిన తర్వాత ఝూ బృందం ఢిల్లీ బయలు దేరి వెళ్లుతుంది. ఢిల్లీలో ప్రధాని వాజ్‌పేయితో ఆయన సోమవారం నాడు సమావేశమవుతారు. ఆగ్రా చేరుకున్నవెంటనే అమర్‌విలాస్ హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్‌కు ఆయన అర్ధాంగితో పాటు ఆయన విశ్రాంతి కోసం వెళ్లారు. గత ఏడాది భారత్ పాకిస్తాన్ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఈ సూట్‌లోనే పాక్ అధినేత ముషారఫ్ బస చేశారు. ఈ మధ్య పాకిస్తాన్‌కు చైనాకు మధ్య దోస్తీ పెరిగిన నేపథ్యంలో భారత్ చైనా సంబంధాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమ ఉత్పత్తుల దిగుమతిపై భారత్ విధించిన ఆంక్షల ఎత్తివేత విషయం చైనా ప్రస్తావించే అవకాశం వుంది.