న్యూఢిల్లీః
పాకిస్తాన్
అధినేత
జనరల్
ముషారఫ్
చేసిన
ప్రసంగంలో
పాజిటివ్
అంశాలు
అనేకం
వున్నాయని
అయితే
మాటలను
చేతల్లోకి
ఏమేరకు
మార్చగలరో
వేచిచూడాల్సివున్నదని
కాంగ్రెస్
నేత
సోనియా
గాంధీ
అభిప్రాయపడ్డారు.
ఆదివారం
నాడు
ప్రధాని
వాజ్పేయి
ఏర్పాటు
చేసిన
అఖిల
పక్ష
సమావేశానికి
హాజరైన
అనంతరం
విలేకరుల
సమావేశంలో
ఆమె
మాట్లాడారు.
లాహోర్
ఒప్పందం,
సివ్లూ
ఒప్పందం
గురించి
ముషారఫ్
తన
ప్రసంగంలో
ప్రస్తావించకపోవడం
పట్ల
ఆమె
విస్మయం
వ్యక్తం
చేశారు.
ముషారఫ్
ప్రసంగం
ధోరణిని
బట్టి
కాశ్మీర్
విషయంలో
మాత్రం
పాక్
వైఖరి
ఏ
మాత్రం
మారినట్టుగా
లేదని
ఆమె
వ్యాఖ్యానించారు.