న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదంపై భారత వాదనను అమెరికా అర్థం చేసుకున్నదని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. ఆరు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన మంగళవారం ఢిల్లీ తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
భారత్ పడుతున్న ఇబ్బందులను అమెరికాకు వినిపించామని, అమెరికా వాటిని అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అమెరికాలో ఆయన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను, విదేశాంగ మంత్రి కాలిన్ పావెల్‌ను, ఇతర నేతలను కలుసుకున్నారు. భారత్ వాదనలను అమెరికా వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. అమెరికాలో ఆయన వాషింగ్టన్‌నే కాకుండా న్యూయార్క్‌ను కూడా సందర్శించారు.