న్యూఢిల్లీః నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాంచల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదల కానున్నది.
ఈ ఎన్నికలతో పాటు 6 లోక్‌సభ స్థానాలకు, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరీ నెల మధ్యలో జరిగే ఈ ఎన్నికలకు నామినేషన్లు ఈ నెల 23 వరకు స్వీకరిస్తారు. 24న స్క్రూటినీ జరుపుతారు. అదేరోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ కూడా. ఫిబ్రవరీ 13న పంజాబ్‌లో మొట్టమొదట ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశ పోలింగ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది. ఉత్తరాంచల్‌లోని అన్ని సీట్లకు, ఉత్తరప్రదేశ్‌లోని 403 స్థానాలకు, మణిపూర్‌లో 60 సీట్లకు ఆరోజు ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 18న యూపీలో కొన్ని స్థానాలకు ఎన్నికలు జరగనుండగా తదుపరి 21న యూపీలోను, మణిపూర్‌లోనూ మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.