• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాతీయ పతాకం నిబంధనల సడలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, ప్రదర్శించడంపై ఇప్పటివరకు వున్న నియమనిబంధనలను ప్రభుత్వం సవరించింది. మంగళవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లాగ్‌ కోడ్‌ కమిటీ నిర్ణయాలను చిన్న చిన్న సవరణలతో కేబినెట్‌ ఆమోదించిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ విలేకరులకు చెప్పారు.

జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, ప్రదర్శించడంపై ఇప్పటివరకు అనేక రకాల ఆంక్షలు వున్నాయి. నిబంధనల సడలింపు వల్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసే విషయంలో, ప్రదర్శించే విషయంలో ప్రజలకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. పతాక ఔన్నత్యం, గౌరవాలకు భంగకరం కానంతవరకు ప్రజలెవ్వరైనా జాతీయ పతాకాన్ని ప్రదర్శించవచ్చని ప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు. బీదబిక్కీ, బాల వయోజన తేడా లేకుండా ఎవరైనా ఏ సందర్భంలోనైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసే వీలు ఇప్పుడు ఏర్పడింది. జాతీయ పతాకాన్ని చేబూని ప్రజలు తమ దేశభక్తిని ప్రదర్శించడంలో తప్పేమిటని ఈ మద్య ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X