హైదరాబాద్ః
టూరిజం
అభివృద్ధికి
వివిధ
జిల్లాల్లో
ప్రత్యేక
ఉత్సవాలు
నిర్వహిస్తున్న
రాష్ట్ర
టూరిజం
శాఖ
కరీంనగర్లో
శాతవాహన
కళోత్సవాల
పేరుతో
పర్యాటక
ఉత్సవాలను
నిర్వహిస్తున్నది.
ఈ
నెల
19
నుంచి
ఈ
ఉత్సవాలు
ప్రారంభమవుతాయి.
పన్నెండు
లక్షల
రూపాయలతో
ఈ
వేడుకలను
నిర్వహిస్తున్నారు.
19న
లోయర్
మానేర్
డామ్‌లో
బోటింగ్,
గంగిరెద్దుల
ప్రదర్శన
నిర్వహిస్తారు.
875
మంది
జానపద
కళాకారుల
వీధి
ప్రదర్శన,
20న
జలయోగ
ప్రదర్శన
జిల్లాలోని
ప్రముఖ
పుణ్యక్షేత్రాల
సందర్శన
తదితర
కార్యక్రమాలు
వుంటాయి.
మూడు
రోజుల
పాటు
జరిగే
ఉత్సవాలను
ప్రజలు
ఎన్నడూ
మర్చిపోకుండా
నిర్వహించనున్నట్టుగా
టూరిజం
శాఖ
కార్యదర్శి
చందనాఖాన్
చెప్పారు.