వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బల్దియా బరిలో అగ్రనేతల ప్రచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః బల్దియా ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ తరఫున సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంగళవారం నాడు ప్రచారం ప్రారంభించారు.

అగ్రనేతల ప్రచారం కావడంతో హంగూ ఆర్బాటలకు కొదువేముంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బన్సీలాల్‌ పేటనుంచి వైఎస్‌ కవాడిగూడనుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు, వందలాది వాహనాల్లో ప్రచారానికి తరలిరావడంతో అనేక చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇద్దరు నేతల ప్రచారంలో విద్యుత్‌ ప్రధాన అంశంగా విమర్శలను, ప్రతివిమర్శలను సంధించారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే మరోసారి విద్యుత్‌ చార్జీలు పెంచడం ఖాయమని వైఎస్‌ హెచ్చరించారు. ఏటా విద్యుత్‌ చార్జీలను పెంచుతున్న తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికల కారణంగా ఈ సారి తాత్సారం చేసిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే తమ విధానాలకే ప్రజలు ఓటు వేసారన్న సాకుతో ఖాయంగా మరోసారి చార్జీలు పెంచుతారని ఆయన హెచ్చరించారు. ఆస్తిపన్ను, విద్యుత్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచమని చంద్రబాబు హామీ ఇస్తే బల్దియా మేయర్‌ ఎన్నికలనుంచి కాంగ్రెస్‌ ఉపసంహరించుకుంటుందని ఆయన సవాలు విసిరారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్‌ చార్జీల గురించి సగం తెలిసి, సగం తెలియక కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా తూర్పారబట్టారు. విద్యుత్‌ చార్జీల విషయంలో ప్రభుత్వానికి ప్రమేయం వుండదని అది పూర్తిగా రెగ్యులేటరీ కమిషన్‌కు సంబంధించిన విషయమని ఆయన చెప్పారు. ఎంత సబ్సిడీనైనా ప్రభుత్వం భరిస్తుందని ప్రజల నెత్తిన చార్జీల భారం రుద్దే సమస్యే లేదని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు వేసే ఓట్లు మురిగిపోయినట్టేనని ఆయన చెప్పారు. దొంగఓట్లతోనే ఎంఐఎం హైదరాబాద్‌లో గెలుస్తున్నదని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X