• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనంతలో ఆయుధాలు స్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః అనంతపురం జిల్లాలో జిల్లా ఎస్‌పి అంజనాసిన్హా సారథ్యంలో ఫాక్షనిస్టులపై దాడులు ముమ్మరమయ్యాయి. తాడిపత్రి డివిజన్‌లో ఫాక్షనిస్టులపై పోలీసులు దాడులు జరిపి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ తుపాకులు, స్వదేశీ తుపాకులు, నాటుబాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 18 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక మండలాధ్యక్షుడు ఒక సర్పంచ్‌ కూడా వున్నారు. హిందూపూర్‌ మున్సిపాల్టీకి జరుగుతున్న ఎన్నికల్లో ఫాక్షనిస్టులు హింసాకాండకు పాల్పడకుండా భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టుగా అంజనాసిన్హా చెప్పారు. ఎస్‌పి అనుసరిస్తున్న వైఖరితో జిల్లాలోని ఫాక్షనిస్టు నేతల గుండెలు జారిపోతున్నట్టుగా చెబుతున్నారు. ప్రజలనుంచి మాత్రం ఆమె చర్యలకు గట్టి మద్దతు లభిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X