రాజమండ్రిః తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ విస్తృతంగా ప్రచారం జరిపారు. మార్కాపురం మున్సిపాల్టీ ఎన్నికల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌కు ఓటు చేస్తే అభివృద్ధికి అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. వందకోట్ల రూపాయలతో ఇప్పటికే రాజమండ్రిలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపట్టిందని పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అభివృద్ధికి అండగా నిలబడాల్సిన బాధ్యత పౌరులపై వున్నదని ఆయన చెప్పారు. వ్యాపారులకోసం విజిలెన్స్ సెల్‌ను ఎత్తివేసిన విషయం ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నేతలు బుచ్చయ్య చౌదరి తదితరులు కూడా పర్యటనలో పాల్గొన్నారు. రాజమండ్రి పర్యటనలో పట్టణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక వరాలు ప్రకటించారు.