• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశ్మీర్‌కు ప్రతినిధి హురియత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కాశ్మీర్‌కు అసలైన ప్రతినిధి తమ సంస్థనేనని హురియత్‌ కాన్ఫరెన్స్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి పరీక్షకైనా తాము సిద్ధమేనని హురియత్‌ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌ ప్రజల నిజమైన ప్రతినిధిగా తమ పాత్రకు రాష్ట్ర ప్రజలందరి ఆమోదం వున్నదని హురియత్‌ నేత మౌల్వీ అబ్బాస్‌ అన్సారీ వ్యాఖ్యానించారు. హురియత్‌ ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ ఘనీభట్‌కు ఆయన్ను వారసునిగా చెప్పుతారు.

కాశ్మీర్‌ ప్రజల అసలుసిసలైన ప్రతినిధులము తామే అని నిరూపించుకోవడానికి ఎన్నికలతో సహా ఎలాంటి ప్రక్రియకైనా తాము సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.
కాశ్మీర్‌ సమస్యను సత్వరం పరిష్కరించడానికి భారత్‌, పాకిస్తాన్‌ ప్రభుత్వాలు చొరవ తీసుకొని చర్చలు జరపాలని హురియత్‌ కోరింది. కాశ్మీర్‌ ప్రజలు హింసకు వ్యతిరేకమని సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకోవలన్నది కాశ్మీర్‌ ప్రజల అభిమతమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X