వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిబాబాపై హత్యా యత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తజనం భగవత్‌స్వరూపంగా ఆరాధించే పుట్టపర్తి సాయిబాబాపై గురువారం నాడు హత్యా యత్నం జరిగింది. ఈ ప్రయత్నం జరిపిన యువకున్ని అక్కడే వున్న భక్తులు, వాలంటీర్లు అక్కడికక్కడే బంధించి పోలీసులకు అప్పగించారు. బాబా సురక్షితంగా వున్నారు. సంఘటన బెంగుళూరు వైట్‌ఫీల్డ్‌లోని బాబా ఆశ్రమం బృందావనంలో జరిగింది. ఉదయం బాబా భక్తులకు ప్రాతఃకాల దర్శనం ఇస్తున్న సమయంలో ఒక పాతికేళ్ల యువకుడు హఠాత్తుగా బాబావైపు దూసుకువచ్చాడని పోలీసులు చెప్పారు.

ప్రమాదాన్ని శంకించిన భక్తులు, అక్కడే వున్న స్వచ్ఛంద సేవకులు వెంటనే ఆ యువకున్ని బంధించారు. ఆ యువకుని నుంచి ఒక పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. అయితే అది డమ్మీ పిస్టల్‌ అని పోలీసులు వెల్లడించారు. బాబాకు ఒక ఉత్తరం అందించడానికి ఆ యువకుడు ప్రయత్నించాడని ఆ ఉత్తరాన్ని కూడా తాము స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. బాబాపై దాడికి ప్రయత్నించిన వ్యక్తిని తమిళనాడు హోసూర్‌కు చెందిన సోమసుందరంగా గుర్తించారు. శ్రీలంక టైగర్ల నుంచి బాబాకు ముప్పు వున్నందున పుట్టపర్తిలోనూ, బెంగుళూర్‌ ఆశ్రమంలోనూ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఈ సంఘటన జరగడం అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X